Sunday, 23 May 2021

VAIKASI VISAGAM - వైకాసి మాసం విశాఖ నక్షత్రం - సుబ్రహ్మణ్య స్వామి అవతరించిన రోజు


వైకాసి మాసం  విశాఖ నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి అవతరించిన రోజుగా ఎంతో విశేషమైనది :
 
తేదీ :  25.05.2021 , మంగళవారం.
సమయం : ఉదయం 4.20  నుండి ..
 
1.    పరమ శివుని పంచ ముఖములు మరియు ఆరవ ముఖమైన అధోముఖం యొక్క మూడవ నేత్రమునుండి అగ్ని రేణువులుగా  శరవణ తటాకము నుండి వైకాసి విసాగం రోజున ఆరుముఖ స్వామిగా ఆవిర్భావం చెందిన రోజు.
 
2.    పూజ : 9.00 Am నుండి 10.00 Am  లేదా సాయంత్రం 6.00 Pm  గంటలకు అభిషేకం చేయవచ్చును .
 
3.    వైకాసి వైశాఖం వ్రతం చేయువారు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం 6.00 II కు నెయ్యి లేక నూనె దీపం వెలిగించవలెను. ఉపవాసం చేయలేని వారు పాలు ఫలములు అల్పాహారములు తీసుకొని వైకాసి వైశాఖం వ్రతం చేయవచ్చును.
 
4.    దేవాలయం దర్శనం, లేదా విగ్రహం/వేలాయుధం ఉన్నవారు ఇంటిలోనే పంచామృత అభిషేకం, తీయని ఫలములు/ఫలహారములు స్వామికి నైవేద్యం, సాధ్యమైన వరకు అన్నదానం.
 
5.    పూజా ద్రవ్యములు కొనలేని వారు మరియు - ఫల పంచామృత అభిషేకం చేయలేని నిరుపేద భక్తులక్తులు నిరాశ చెందవలసిన అవసరం లేదు ,   సుబ్రహ్మణ్యుని మన మనసులో పరమ భక్తితో ఆరాధనా చేయు మార్గం ఒకటి ఉన్నది.  
 
6.    శ్రీ  పాంబన్ మద్గురు కుమార గురుదాస స్వామిగాళ్ (పాంబన్ స్వామి) రచించిన "పరిపూర్ణ పంచామృత వణ్ణం"  అను కీర్తనం  / పద్యములో మురుగన్ కి అభిషేకం చేయు విధానము ఫలితములతో కూడిన  అద్భుతమైన కీర్తనం ,   ముఖ్యంగా స్వామికి  పాలు, పెరుగు, నెయ్యి,  తేనే, పంచదార అభిషేకములు గురించి చెప్పునది.
 
7.     "పరిపూర్ణ పంచామృత వణ్ణం -  పారాయణ  చేసిన ప్రదేశములలోన నేను స్వయంగా ఆలకించి భక్తులకు అనుగ్రహిస్తాను అని ఆ తిరుచెందూర్ జయంతి నాదర్ స్వామి  పలికినట్టుగా  తిరుచెందూర్ క్షేత్రం నందు  కొన్ని దశాబ్దాల క్రితం నుండి  స్వామి భక్తురాలు  తిరు ముత్తమ్మ”  అను అవ్వ యొక్క భక్త విలాసము  ఎంతో ప్రసిద్ధి చెందినది.
 
8.    పారాయణ/శ్రవణం కొరకు క్రింది లింక్స్ ను వీక్షించగలరు :  
 
"పరిపూర్ణ పంచామృత వణ్ణం"   
https://www.youtube.com/watch?v=FWz8ekIKZvc
https://www.youtube.com/watch?v=cz7AXQRxiL8
 
9.    ఫలం : సంతానం భాగ్యం , కళ్యాణం , ఆరోగ్యం, శుభకార్యములు, ధన వృద్ధి, చేపట్టు పనులలో విజయము, శత్రు నాశనం జరుగును, జ్ఞానం , విద్యాభి వృద్ధి, దుష్ట శక్తులు తొలగిపోతాయి.
 
10. ఇతర విశేషములు : మరియు రోజు పన్నెండు ఆళ్వార్ లలో నమ్మాళ్వార్ జన్మించిన తిధి, యమ భగవానుడు అవతరించిన రోజు,  మహాభారతం లో అర్జునుడు శివ భగవానుని నుండి పాశుపత అస్త్రం పొందిన రోజు, సిద్ధార్థుడు జన్మించిన రోజు మరియు గౌతమ బుద్దునిగా జ్ఞానోదయం పొందిన రోజు.
 
11. మంత్రం : సుబ్రహ్మణ్య గాయత్రీ పారాయణ.
 
12. సుబ్రహ్మణ్య శరణు ఘోష ... హరోo హరా..
1.      వెట్రి వేల్ మురుగనుక్కు  - హరోo హరా..
2.      వీర వేల్ మురుగనుకు - హరోo హరా..
3.      జ్ఞాన వేల్ మురుగనుకు - హరోo హరా..
4.      రత్న వేల్ మురుగనుకు - హరోo హరా..
5.      శక్తి వేల్ మురుగనుకు - హరోo హరా..
6.      ఆరుపడై మురుగనుకు - హరోo హరా..
7.      అయ్యప్ప సోదరుని కి - హరోo హరా..
8.      గణపతి సోదరునికి  -హరోo హరా..
9.      పార్వతి పుత్రునికి - హరోం హరా..
10.  ఈశ్వర కుమారునికి -  హరోం హరా..
11.  తిరుత్తని మురుగనుకు - హరోo హరా..
12.  తిరుప్పరoకుండ్రమ్ మురుగనుకు - హరోo హరా..
13.  ఫళణి మలై మురుగనుకు - హరోo హరా..
14.  స్వామిమలై మురుగనుకు - హరోo హరా..
15.  తిరుచెందూర్ మురుగనుకు - హరోo హరా..
16.  సోలై మలై మురుగనుకు - హరోo హరా..
వెట్రి వేల్  - మురుగనుకు - హరోo హరా..
శ్రీ కార్తికేయ సేవ భక్త బృందం., మచిలీపట్నం.
 
http://karthikeyaseva.blogspot.com/2021/05/vaikasi-visagam.html
రవికుమార్ - పి.
కార్తికేయ సేవా భక్త బృందం,
మచిలీపట్టణం.
 
 

Monday, 1 February 2021

Murugan Sastra Bandham - శస్త్ర బంధనం

 శస్త్ర బంధనం

(పాంబన్ శ్రీ మద్గురు కుమార గురు దాస స్వామి)


SUBRAHMANYA SWAMI - THAIPOOSAM 2021 - ABHISHEKAM

 తైపూసం పర్వదినం, జనవరి 28 వ తేదీ 2021, గురువారం 

శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులకు భక్త బృందంచే ఉదయం పంచామృత అభిషేకం, ఆరుపడైవీడు పడిపూజా, స్కంద షష్టి కవచం, తిరుప్పుగల్ పారాయణం. 

హోమంలో నెమలి వాహనం దర్శనం.. 










 






Sunday, 24 January 2021

MOPIDEVI TEMPLE - KAAVADI FESTIVAL - 2019


మోపిదేవి -  ఆడికృతిక  కావడి ఉత్సవం -2019 


























KAAVADI FESTIVAL - BIKKAVOLU - కావడి ఉత్సవం - బిక్కవోలు

కావడి ఉత్సవం 

శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, బిక్కవోలు 


KAAVADI FESTIVAL -  

SRI KUMAARA SUBRAHMANYA SWAMI DEVASTHANAM

BIKKAVOLU















































Saturday, 23 January 2021


 Thaipoosam Kaavadi Festival - 2021 

::వెట్రి వేల్ మురుగన్ కు హారో హర::



తైపూసం కావడి నగరోత్సవం

 శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భక్తులకు విన్నపం 

ఆంధ్ర రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా గత 5 సంవత్సరాలుగా మచిలీపట్టణం లో మనం ప్రతి సంవత్సరం జరుపుకొను - అఖిలాండకోటి బ్రహ్మాండముల రక్షకుడు, దేవతా గణముల సర్వ సైన్యాధిపతి, జ్ఞాన శక్తి స్వరూపుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యుని తైపూసం కావడి నగరోత్సవం లో 200 కావడులు, 200 పాల కలశములతో సుమారు 2వేలకు పైగా భక్తులు తమ స్వహస్తాలతో స్వామికి అభిషేకం జరుపుకొనుట మరియు 3వేలకు పైగా భక్తులకు అన్నదానము జరుగుతున్నది.


ప్రతి సంవత్సరం కావడి నగరోత్సవంలో పాల్గొను భక్తులు వందల సంఖ్యలో అధికమవుతున్న కారణమున, భక్తుల ఆరోగ్యం మరియు కరోనా మహమ్మారి నివారణ-నిబంధనల దృష్ట్యా ఈ సంవత్సరం తైపూసం కావడి నగరోత్సవం మరొక విశేష దినములోన జరుపుకొనుటకు స్వామి అనుజ్ఞ అయినది.


కావున తైపూసం పర్వదినం, జనవరి 28 వ తేదీ 2021, గురువారం ఉదయం 7.00 గం.లకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తి, గొడుగుపేట లోని స్వామి గృహంలో భక్త బృందంచే ఉదయం పంచామృత అభిషేకం, భజన, ఆరుపడైవీడు పడిపూజా , భజన,  స్కంద షష్టి కవచం, తిరుప్పుగల్ పారాయణం మరియు 50 మంది నిరుపేదలకు స్వామివారి అన్న ప్రసాద వినియోగం జరుగును. 


కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి  కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.

 

శ్రీ కార్తికేయ సేవ భక్తబృందం

గొడుగుపేట, మచిలీపట్టణం. 

http://karthikeyaseva.blogspot.com/