Saturday, 23 January 2021


 Thaipoosam Kaavadi Festival - 2021 

::వెట్రి వేల్ మురుగన్ కు హారో హర::



తైపూసం కావడి నగరోత్సవం

 శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భక్తులకు విన్నపం 

ఆంధ్ర రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా గత 5 సంవత్సరాలుగా మచిలీపట్టణం లో మనం ప్రతి సంవత్సరం జరుపుకొను - అఖిలాండకోటి బ్రహ్మాండముల రక్షకుడు, దేవతా గణముల సర్వ సైన్యాధిపతి, జ్ఞాన శక్తి స్వరూపుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యుని తైపూసం కావడి నగరోత్సవం లో 200 కావడులు, 200 పాల కలశములతో సుమారు 2వేలకు పైగా భక్తులు తమ స్వహస్తాలతో స్వామికి అభిషేకం జరుపుకొనుట మరియు 3వేలకు పైగా భక్తులకు అన్నదానము జరుగుతున్నది.


ప్రతి సంవత్సరం కావడి నగరోత్సవంలో పాల్గొను భక్తులు వందల సంఖ్యలో అధికమవుతున్న కారణమున, భక్తుల ఆరోగ్యం మరియు కరోనా మహమ్మారి నివారణ-నిబంధనల దృష్ట్యా ఈ సంవత్సరం తైపూసం కావడి నగరోత్సవం మరొక విశేష దినములోన జరుపుకొనుటకు స్వామి అనుజ్ఞ అయినది.


కావున తైపూసం పర్వదినం, జనవరి 28 వ తేదీ 2021, గురువారం ఉదయం 7.00 గం.లకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తి, గొడుగుపేట లోని స్వామి గృహంలో భక్త బృందంచే ఉదయం పంచామృత అభిషేకం, భజన, ఆరుపడైవీడు పడిపూజా , భజన,  స్కంద షష్టి కవచం, తిరుప్పుగల్ పారాయణం మరియు 50 మంది నిరుపేదలకు స్వామివారి అన్న ప్రసాద వినియోగం జరుగును. 


కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి  కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.

 

శ్రీ కార్తికేయ సేవ భక్తబృందం

గొడుగుపేట, మచిలీపట్టణం. 

http://karthikeyaseva.blogspot.com/







No comments: