Sunday, 6 July 2025

"కందర్ అనుభూతి" Kandar Anibhooti Telugu

అరుణగిరినాధర్ అనుగ్రహభాషణము అయిన సుబ్రహ్మణ్య స్వామి కావ్య గ్రంధము "కందర్ అనుభూతి " నుండి ఒక పదిక్కము (కీర్తన) : 

உருவாய் அருவாய் உளதாய் இலதாய்
மருவாய் மலராய் மணியாய் ஒளியாய்க்
கருவாய் உயிராய்க் கதியாய் விதியாய்க்
குருவாய் வருவாய் அருள்வாய் குகனே!

ఊరువాయ్ అరువాయ్ ఉళదాయి ఇళదాయి
మరువాయ్ మలరాయి మానియాయి ఒళియాయ్ 
కరువాయ్ ఉయిరాయి గదియాయ్ విదియాయి   
గురువాయ్ వరువాయ్ ఆరుల్వాయి గుహనే

உருவமுள்ளவராகவும், உருவமில்லாதவராகவும், உள்ள பொருளாகவும், காணவியலாத பொருளாகவும், நறுமணமாகவும், அந்த நறுமணத்தை உடைய மலராகவும், இரத்தினமாகவும் அந்த இரத்தினம் வீசும் ஒளியாகவும், உயிர் இடம்பெறும் கருவாகவும், உடலாகவும், உயிராகவும் நற்கதியான புகலிடமாகவும் அந்த நற்கதியை நோக்கிச் செலுத்தும் விதியாகவும் விளங்கும் குகமூர்த்தியே! தேவரீர் குருமூர்த்தியாக எழுந்தருளிவந்து அடியேனுக்கு அருள்புரிவீராக!

అనువాదం :

ఓ, తిరుమూరుగ పెరుమాన్ దైవమే (సుబ్రహ్మణ్య స్వామినే ) ! 
నీవే శివపెరుమన్ (శివుని రూపము)!
నీవే ఆకారము మరియు నిరాకారము అయినవాడవు ! 
నీవే అస్తిత్వం మరియు కనిపించని జీవము అయినావు !  
నీవే సువాసనయు - ఆ సువాసన కలిగిన పుష్పమును ! 
నీవే విలువైన రత్నం అయినావు అందునా ప్రకాశించే కాంతి - మెరుపు అయినావు !
నీవే జీవాత్మ ! నీవే ముక్తి యొక్క నివాసం [విముక్తి] మరియు నీవే విధి కూడా అయినావు, ఆత్మను ముక్తి నివాసానికి నడిపించెడి పరమ గురు మూర్తి అయినావు ! ఈ దాసుడను దీవించి అనుగ్రహించగా దర్శనం ఒనరించు స్వామి.. 

వెట్రి వేల్ మురుగన్ కి హారో హర

రవికుమార్ పేరాంబాకం.
కార్తికేయ సేవ భక్త బృందం, 
మచిలీపట్టణం.
9059065452

No comments: