Sunday, 6 July 2025

"కందర్ అనుభూతి" Kandar Anibhooti Telugu

అరుణగిరినాధర్ అనుగ్రహభాషణము అయిన సుబ్రహ్మణ్య స్వామి కావ్య గ్రంధము "కందర్ అనుభూతి " నుండి ఒక పదిక్కము (కీర్తన) : 

உருவாய் அருவாய் உளதாய் இலதாய்
மருவாய் மலராய் மணியாய் ஒளியாய்க்
கருவாய் உயிராய்க் கதியாய் விதியாய்க்
குருவாய் வருவாய் அருள்வாய் குகனே!

ఊరువాయ్ అరువాయ్ ఉళదాయి ఇళదాయి
మరువాయ్ మలరాయి మానియాయి ఒళియాయ్ 
కరువాయ్ ఉయిరాయి గదియాయ్ విదియాయి   
గురువాయ్ వరువాయ్ ఆరుల్వాయి గుహనే

உருவமுள்ளவராகவும், உருவமில்லாதவராகவும், உள்ள பொருளாகவும், காணவியலாத பொருளாகவும், நறுமணமாகவும், அந்த நறுமணத்தை உடைய மலராகவும், இரத்தினமாகவும் அந்த இரத்தினம் வீசும் ஒளியாகவும், உயிர் இடம்பெறும் கருவாகவும், உடலாகவும், உயிராகவும் நற்கதியான புகலிடமாகவும் அந்த நற்கதியை நோக்கிச் செலுத்தும் விதியாகவும் விளங்கும் குகமூர்த்தியே! தேவரீர் குருமூர்த்தியாக எழுந்தருளிவந்து அடியேனுக்கு அருள்புரிவீராக!

అనువాదం :

ఓ, తిరుమూరుగ పెరుమాన్ దైవమే (సుబ్రహ్మణ్య స్వామినే ) ! 
నీవే శివపెరుమన్ (శివుని రూపము)!
నీవే ఆకారము మరియు నిరాకారము అయినవాడవు ! 
నీవే అస్తిత్వం మరియు కనిపించని జీవము అయినావు !  
నీవే సువాసనయు - ఆ సువాసన కలిగిన పుష్పమును ! 
నీవే విలువైన రత్నం అయినావు అందునా ప్రకాశించే కాంతి - మెరుపు అయినావు !
నీవే జీవాత్మ ! నీవే ముక్తి యొక్క నివాసం [విముక్తి] మరియు నీవే విధి కూడా అయినావు, ఆత్మను ముక్తి నివాసానికి నడిపించెడి పరమ గురు మూర్తి అయినావు ! ఈ దాసుడను దీవించి అనుగ్రహించగా దర్శనం ఒనరించు స్వామి.. 

వెట్రి వేల్ మురుగన్ కి హారో హర

రవికుమార్ పేరాంబాకం.
కార్తికేయ సేవ భక్త బృందం, 
మచిలీపట్టణం.
9059065452

Friday, 4 July 2025

TM Khadar Basha - (CE 1880s) Harmony- సుబ్రహ్మణ్యుని కీర్తనతో ఉరి శిక్ష రద్దు చేయబడిన సంఘటన

Incident where the death sentence was discharged upon listening the live Music performance on God Subrahmanya

వెట్రి వేల్ మురుగన్ కి హారోహర 

సురులిమలై పైన వెలసిన గుణశీలా !! నిన్ను నా భక్తితో ఓడిస్తాను సుబ్రహ్మణ్య వేలా!  & శరవణ భవ గుహనే రా ! అంటూ పాడిన సుబ్రహ్మణ్యుని కీర్తనతో ఉరి శిక్ష రద్దు చేయబడిన సంఘటన 


హార్మోనియం చక్రవర్తి శ్రీ  వరైయూర్  టి ఎం ఖాదర్ భాషా వారు (CE 1880s) 


(சுருளிமலை மீது மேவும் சீலா உன்னை தோத்தரிப்பேன் சுப்பிரமணிய வேலா)


వరైయూర్  టి ఎం ఖాదర్ భాషా  ( CE 1880s) సం.లోని  ప్రఖ్యాత  హార్మోనియం విద్వాన్, కే యస్ దేవుడు అయ్యర్, వెంకటేశన్ అయ్యర్, పేరూర్ సుబ్రహ్మణ్య దీక్షితార్ మొదలగు విద్వాన్ల సమకాలికుడు,  ఆ కాలంలోనీ  ప్రఖ్యాత గాత్ర  వాగ్గేయకారులు మరియు  భాగవతార్లు తమ ప్రదర్శనలో బృందం లో  ఖాదర్ భాషా వారి  సమయం (డేట్స్) కోసం సంవత్సరాలు తరబడి ఎదురు చూసేవారట, వీరి సమకాలీకులైన వీకే రామస్వామి అయ్యర్ గారు రచించిన "ఎనదు కలై పురాణం* అనే స్వీయ చరిత్ర పుస్తకంలో..  టీ ఎం ఖాదర్ భాషా వారి వాయిద్యగానం  కోసం ఎన్ని గంటలైనా అభిమానులు భక్తులు వేచి చూసేవారట.  


టి ఎం ఖాదర్ భాషా గారు  ఒక హత్య అభియోగంలో ఉరిశిక్ష ఖరారు చేయబడి ఉరిశిక్ష అమలు చేసే రోజున ఉరికంబం ఎక్కే ముందుగా  తన  చివరి కోరిక ఏమిటని  బ్రిటిష్ అధికారులు అడగగా తాను చివరిసారిగా తనకు ప్రియమైన హార్మోనియం పైన ఒక పాటను పాడుకొని తన జీవితం ముగిస్తాను అని కోరగా జైలు అధికారులు సమ్మతించారు.  

"సురులిమలై పైన వెలసిన గుణశీలా !!  నిన్ను నా భక్తితో ఓడిస్తాను సుబ్రహ్మణ్య వేలా" అని తన వేళ్ళతో హార్మోనియం హార్మోనియం పెట్టెను సవరిస్తూ గానం మొదలుపెట్టి పాడుతూ పాడుతూ 45 నిమిషాలు గడిచిన తర్వాత ముగించారట.. క్రైస్తవ బ్రిటిష్ జైలు అధికారులు గానం ముగిసిన తర్వాత అప్పటికే 20 నిమిషాలు సమయం దాటిపోయింది గమనించి ఆరోజుకి శిక్ష ఆపివేసి,  మరల మరుసటి రోజు జడ్జి గారి ముందు ఆర్డర్ కొరకు హాజరుపరిచగా..  బ్రిటిష్ సంతతికి చెందిన జడ్జిగారు ఎందుకు ఆజ్ఞను పాటించలేదు అని అడగగా ముద్దాయి చివరి కోరికగా భక్తి గానం పాడారు ఆ గానం  వింటూ మాకు  సమయం తెలియలేదు అని బదులిచ్చారు , అయితే జైలు అధికారులు కూడా బ్రిటిష్ సంతతికి చెందిన వారు కావున జడ్జిగారు ఇది సరైన కారణం కాకపోవచ్చు అనుమానించి వేరే ఏదైనా కారణం ఉండవచ్చని  తానే స్వయంగా తెలుసుకుందామని హార్మోనియం పెట్టెను తెప్పించి మరల పాట పాడమని కోర్టులో హాల్లో అడిగారట. 

టిఎం ఖాదర్ భాషా గారు మరల ఆ సూరులిమలై  సుబ్రహ్మణ్యస్వామి వారిని కీర్తిస్తూ పాటని మొదలుపెట్టి పూర్తి చేసే సమయానికి  బ్రిటిష్ క్రైస్తవ  న్యాయమూర్తి ఆ పాటకి మైమరిచిపోయి తన రెండు కళ్ళల నుండి నీళ్లు రావడం గమనించి ఇంత అద్భుతమైన భక్తి గానం చేసేవారు ఖచ్చితంగా ఈ హత్య చేసి ఉండరు అని కేసును కొట్టివేసి విడుదల చేశారట. 

వెట్రీ వేల్ మురుగనిక్కి హరోహర !! 

*సురళీమలై బాలనికి హరో హర*.🙏🙏

గానం లింక్ కింద ఇవ్వబడినది🙏🙏




సేకరణ & అనువాదం : 

రవికుమార్ పేరంబాకం 
కార్తికేయ సేవా భక్త బృందం 
మచిలీపట్నం.
9059065452

Tuesday, 1 July 2025

#Saranughosha సుబ్రహ్మణ్య శరణు ఘోష ... హరోo హరా..



సుబ్రహ్మణ్య శరణు ఘోష ... హరోహరా..


1.      వెట్రి వేల్ మురుగనుక్కు  హరోహరా..
2.      వీర వేల్ మురుగనుకు - హరోహరా..
3.      జ్ఞాన వేల్ మురుగనుకు - హరోహరా..
4.      రత్న వేల్ మురుగనుకు - హరోహరా..
5.      శక్తి వేల్ మురుగనుకు - హరోహరా..
6.      ఆరుపడై మురుగనుకు - హరోహరా..
7.      అయ్యప్ప సోదరుని కి - హరోహరా..
8.      గణపతి సోదరునికి  -హరోహరా..
9.      పార్వతి పుత్రునికి - హరోం హరా..
10.  ఈశ్వర కుమారునికి -  హరోం హరా..
11.  తిరుత్తని మురుగనుకు - హరోహరా..
12.  తిరుప్పరoకుండ్రమ్ మురుగనుకు - హరోహరా..
13.  ఫళణి మలై మురుగనుకు - హరోహరా..
14.  స్వామిమలై మురుగనుకు - హరోహరా..
15.  తిరుచెందూర్ మురుగనుకు - హరోహరా..
16.  సోలై మలై మురుగనుకు - హరోహరా..
వెట్రి వేల్  మురుగనుకు - హరోహరా..

శ్రీ కార్తికేయ సేవ భక్త బృందం., మచిలీపట్నం.
 
రవికుమార్ - పి.
మచిలీపట్టణం.
9059065452