Saturday, 11 February 2023
Tuesday, 27 December 2022
Thaipusam Kaavadi festival Invitation - 2023 - తైపూసమ్ కావడి నగరోత్సవం ఆహ్వానం - 2023 ఫిబ్రవరి 5, ఆదివారం
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన
"తైపూసమ్" కావడి సేవ నగరోత్సవము.
ఫిబ్రవరి 5 వ తేదీ 2023 , ఆదివారం ఉదయం 6.00 గంటలకు,
మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం నుండి , 270 కావడులు, 180 పాలకలశములతో "షట్కోణ యంత్ర" పూజ జరిపించుకొని, "పంబ ఉడుక్కై" మరియు "సన్నాయి మంగళ" వాయిద్యాలతో "ఫలణి కావడి పాదయాత్ర" వలె నగరోత్సవము పాతబస్టాండ్ "పర్వతవర్ధిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి " వారి దేవస్థానమునకు చేరును, తదుపరి కావడి ధారులచే శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తి కి అభిషేకం జరుగును.
ఫిబ్రవరి 6 వ తేదీ 2023 సోమవారం ఉదయం 7.00 గంటలకు "సుబ్రహ్మణ్య పాశుపతాస్త్ర హోమం" జరుగును.
కావున భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్ధన.
కావడి సేవకై సంప్రదించండి :
కార్తికేయ సేవ ట్రస్ట్ (రి. 77 22), గొడుగుపేట, మచిలీపట్నం - 9247330323
Wednesday, 26 October 2022
Article 1 - Tiruchendur - కరుణా సాగరమా స్కందా నీకు జయము
*తిరుచెందూర్ మురుగన్ కి హారోహర*
*கருணைக் கடலே கந்தா போற்றி*
*తెలుగు అనువాదం మరియు పురాణం* :
*అనువాదం* : కరుణా సాగరమా స్కందా నీకు జయము
*పురాణం*: తారక,సింహముఖ & సూరపద్మాసుర సంహారం అనంతరం అక్కడి తిరుచెందూర్ కడలి తీరంలో శివ పూజలో నిమగ్నమైన *దేవసేనాధిపతి శత్రుసంహారకుడు శ్రీ సుబ్రహ్మణ్యుని* , సముద్రం అవతల నుండి సూరపద్మాసుర రాజ్యంలోనుండి ఆర్తి తో "మురుగా శరణం " అనే పిలుపు ఆయన చెవిన పడగా, తనను శరణు వేడినవారు మరల ఏమి అపాయములో ఉన్నారో యని శివ పూజలో నిమగ్నమైన సుబ్రహ్మణ్యుడు మరుక్షణం ఆలోచింపక పూజను మధ్యనే విడిచి తన భక్తుల కోసం మరల తన కొలుసాయుధం ధరించి ( సూర పద్మాసురుని సంహారం కోసం స్వామి స్వయంగా తయారు చేసుకొనిన ఆయుధం - తిరుచెందూర్ క్షేత్రం లో స్వామి ఆయుధం పేరు ) *నామ్ ఇరుక్క భయం ఎన్ (అనగా నేనుండ భయమేల ) అనే వాణిని వినిపించి తన అభయ హస్తముతో దివ్య మంగళ స్వరూపంగా అక్కడే శ్రీ జయంతి నాధర్* గా కొలువైన క్షేత్రం .
స్వామి వాణి వినపడగా , సాగరము అవతలి నుండి తన భక్తులు పలికిన జయ కీర్తనము
🙏*కరుణా సాగరమా స్కందా నీకు జయము*🙏
🙏*కరుణా సాగరమా స్కందా నీకు జయము*🙏
🙏*కరుణా సాగరమా స్కందా నీకు జయము*🙏
స్వామి శివోపాసన చేసే పంచలింగం అక్కడే మూలవిరాట్ పక్కనే గుహలో మనం చూడగలము.
*వెట్రివేల్ మురుగన్ కి హారోహర *
అనువాదం:
రవికుమార్ P.
కార్తికేయ సేవ భక్త బృందం.
మచిలీపట్టణం.
https://karthikeyaseva.blogspot.com/
9059065452
Tuesday, 25 October 2022
Sunday, 3 April 2022
Subscribe to:
Posts (Atom)