Wednesday, 26 October 2022

Article 1 - Tiruchendur - కరుణా సాగరమా స్కందా నీకు జయము



*తిరుచెందూర్ మురుగన్ కి హారోహర*

*கருணைக்  கடலே கந்தா போற்றி* 
*తెలుగు అనువాదం మరియు పురాణం* : 

*అనువాదం* : కరుణా సాగరమా స్కందా నీకు జయము 

*పురాణం*:    తారక,సింహముఖ & సూరపద్మాసుర సంహారం అనంతరం అక్కడి తిరుచెందూర్ కడలి తీరంలో శివ పూజలో నిమగ్నమైన *దేవసేనాధిపతి శత్రుసంహారకుడు శ్రీ సుబ్రహ్మణ్యుని* , సముద్రం అవతల నుండి సూరపద్మాసుర  రాజ్యంలోనుండి ఆర్తి తో  "మురుగా శరణం " అనే పిలుపు ఆయన చెవిన పడగా, తనను శరణు వేడినవారు మరల ఏమి అపాయములో ఉన్నారో యని  శివ పూజలో నిమగ్నమైన సుబ్రహ్మణ్యుడు మరుక్షణం ఆలోచింపక పూజను మధ్యనే విడిచి తన భక్తుల కోసం మరల తన కొలుసాయుధం ధరించి ( సూర పద్మాసురుని సంహారం కోసం స్వామి స్వయంగా తయారు చేసుకొనిన ఆయుధం - తిరుచెందూర్ క్షేత్రం లో స్వామి ఆయుధం పేరు )   *నామ్ ఇరుక్క భయం ఎన్ (అనగా   నేనుండ భయమేల )  అనే వాణిని వినిపించి తన అభయ హస్తముతో దివ్య మంగళ స్వరూపంగా అక్కడే  శ్రీ జయంతి నాధర్* గా కొలువైన క్షేత్రం . 

స్వామి వాణి వినపడగా , సాగరము అవతలి నుండి తన భక్తులు పలికిన జయ కీర్తనము 
🙏*కరుణా సాగరమా స్కందా  నీకు జయము*🙏 
🙏*కరుణా సాగరమా స్కందా  నీకు జయము*🙏
🙏*కరుణా సాగరమా స్కందా  నీకు జయము*🙏

స్వామి శివోపాసన చేసే పంచలింగం అక్కడే మూలవిరాట్ పక్కనే గుహలో మనం చూడగలము.

*వెట్రివేల్ మురుగన్ కి హారోహర *
అనువాదం: 
రవికుమార్ P. 
కార్తికేయ సేవ భక్త బృందం.
మచిలీపట్టణం.  

https://karthikeyaseva.blogspot.com/
9059065452

Sunday, 3 April 2022

KAAVADI FESTIVAL,. Rajamahendravaram - కావడి ఉత్సవం - రాజమహేంద్రవరం

KAAVADI FESTIVAL, Rajamahendravaram 

కావడి ఉత్సవం - రాజమహేంద్రవరం

https://youtu.be/3fNleD-BXos 



























































Saturday, 31 July 2021

Aadi Kruthika Importance - ఆడి కృత్తికా విశిష్టత



సుబ్రహ్మణ్య ఆరాధన వాట్సాప్  సమూహం భక్త జనులు కొరకు🙏🙏🙏

ఆడి కృత్తికా నక్షత్రం పర్వదినం  సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశిష్టత , ఈ క్రింది లింక్ నందు డౌన్లోడ్ చేసుకొనగలరు 🙏🙏



సంకలనం : శ్రీ కార్తికేయ భక్త బృందం, మచిలీపట్నం. 9059065452  


Sunday, 23 May 2021

#VAIKASI VISAGAM - వైకాసి మాసం విశాఖ నక్షత్రం - సుబ్రహ్మణ్య స్వామి అవతరించిన రోజు


వైకాసి మాసం  విశాఖ నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి అవతరించిన రోజుగా ఎంతో విశేషమైనది :
 
తేదీ :  25.05.2021 , మంగళవారం.
సమయం : ఉదయం 4.20  నుండి ..
 
1.    పరమ శివుని పంచ ముఖములు మరియు ఆరవ ముఖమైన అధోముఖం యొక్క మూడవ నేత్రమునుండి అగ్ని రేణువులుగా  శరవణ తటాకము నుండి వైకాసి విసాగం రోజున ఆరుముఖ స్వామిగా ఆవిర్భావం చెందిన రోజు.
 
2.    పూజ : 9.00 Am నుండి 10.00 Am  లేదా సాయంత్రం 6.00 Pm  గంటలకు అభిషేకం చేయవచ్చును .
 
3.    వైకాసి వైశాఖం వ్రతం చేయువారు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం 6.00 II కు నెయ్యి లేక నూనె దీపం వెలిగించవలెను. ఉపవాసం చేయలేని వారు పాలు ఫలములు అల్పాహారములు తీసుకొని వైకాసి వైశాఖం వ్రతం చేయవచ్చును.
 
4.    దేవాలయం దర్శనం, లేదా విగ్రహం/వేలాయుధం ఉన్నవారు ఇంటిలోనే పంచామృత అభిషేకం, తీయని ఫలములు/ఫలహారములు స్వామికి నైవేద్యం, సాధ్యమైన వరకు అన్నదానం.
 
5.    పూజా ద్రవ్యములు కొనలేని వారు మరియు - ఫల పంచామృత అభిషేకం చేయలేని నిరుపేద భక్తులక్తులు నిరాశ చెందవలసిన అవసరం లేదు ,   సుబ్రహ్మణ్యుని మన మనసులో పరమ భక్తితో ఆరాధనా చేయు మార్గం ఒకటి ఉన్నది.  
 
6.    శ్రీ  పాంబన్ మద్గురు కుమార గురుదాస స్వామిగాళ్ (పాంబన్ స్వామి) రచించిన "పరిపూర్ణ పంచామృత వణ్ణం"  అను కీర్తనం  / పద్యములో మురుగన్ కి అభిషేకం చేయు విధానము ఫలితములతో కూడిన  అద్భుతమైన కీర్తనం ,   ముఖ్యంగా స్వామికి  పాలు, పెరుగు, నెయ్యి,  తేనే, పంచదార అభిషేకములు గురించి చెప్పునది.
 
7.     "పరిపూర్ణ పంచామృత వణ్ణం -  పారాయణ  చేసిన ప్రదేశములలోన నేను స్వయంగా ఆలకించి భక్తులకు అనుగ్రహిస్తాను అని ఆ తిరుచెందూర్ జయంతి నాదర్ స్వామి  పలికినట్టుగా  తిరుచెందూర్ క్షేత్రం నందు  కొన్ని దశాబ్దాల క్రితం నుండి  స్వామి భక్తురాలు  తిరు ముత్తమ్మ”  అను అవ్వ యొక్క భక్త విలాసము  ఎంతో ప్రసిద్ధి చెందినది.
 
8.    పారాయణ/శ్రవణం కొరకు క్రింది లింక్స్ ను వీక్షించగలరు :  
 
"పరిపూర్ణ పంచామృత వణ్ణం"   
https://www.youtube.com/watch?v=FWz8ekIKZvc
https://www.youtube.com/watch?v=cz7AXQRxiL8
 
9.    ఫలం : సంతానం భాగ్యం , కళ్యాణం , ఆరోగ్యం, శుభకార్యములు, ధన వృద్ధి, చేపట్టు పనులలో విజయము, శత్రు నాశనం జరుగును, జ్ఞానం , విద్యాభి వృద్ధి, దుష్ట శక్తులు తొలగిపోతాయి.
 
10. ఇతర విశేషములు : మరియు రోజు పన్నెండు ఆళ్వార్ లలో నమ్మాళ్వార్ జన్మించిన తిధి, యమ భగవానుడు అవతరించిన రోజు,  మహాభారతం లో అర్జునుడు శివ భగవానుని నుండి పాశుపత అస్త్రం పొందిన రోజు, సిద్ధార్థుడు జన్మించిన రోజు మరియు గౌతమ బుద్దునిగా జ్ఞానోదయం పొందిన రోజు.
 
11. మంత్రం : సుబ్రహ్మణ్య గాయత్రీ పారాయణ.
 
12. సుబ్రహ్మణ్య శరణు ఘోష ... హరోo హరా..
1.      వెట్రి వేల్ మురుగనుక్కు  - హరోo హరా..
2.      వీర వేల్ మురుగనుకు - హరోo హరా..
3.      జ్ఞాన వేల్ మురుగనుకు - హరోo హరా..
4.      రత్న వేల్ మురుగనుకు - హరోo హరా..
5.      శక్తి వేల్ మురుగనుకు - హరోo హరా..
6.      ఆరుపడై మురుగనుకు - హరోo హరా..
7.      అయ్యప్ప సోదరుని కి - హరోo హరా..
8.      గణపతి సోదరునికి  -హరోo హరా..
9.      పార్వతి పుత్రునికి - హరోం హరా..
10.  ఈశ్వర కుమారునికి -  హరోం హరా..
11.  తిరుత్తని మురుగనుకు - హరోo హరా..
12.  తిరుప్పరoకుండ్రమ్ మురుగనుకు - హరోo హరా..
13.  ఫళణి మలై మురుగనుకు - హరోo హరా..
14.  స్వామిమలై మురుగనుకు - హరోo హరా..
15.  తిరుచెందూర్ మురుగనుకు - హరోo హరా..
16.  సోలై మలై మురుగనుకు - హరోo హరా..
వెట్రి వేల్  - మురుగనుకు - హరోo హరా..
శ్రీ కార్తికేయ సేవ భక్త బృందం., మచిలీపట్నం.
 
http://karthikeyaseva.blogspot.com/2021/05/vaikasi-visagam.html

రవికుమార్ - పి.
కార్తికేయ సేవా భక్త బృందం,
మచిలీపట్టణం.