अपस्मारकुष्टक्षयार्शःप्रमेह-
ज्वरन्मादिगुल्मादिरोगा महान्तः ।
पिशाचाश्च सर्वे भवत्पत्रभूतिं
विलोक्यक्षणात्तरकारे द्रवन्ते ॥२५॥
జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల సుబ్రహ్మణ్య భుజంగం - 25 శ్లోకo వివరణ !
"ఓ తారకారీ! ( తారకాసురుడిని నాశనం చేసినవాడా)!! మూర్ఛ, కుష్టు, క్షయ, పైత్యం మరియు దుష్టశక్తులు వంటి మానవులను పీడించే సమస్త వ్యాధులు కూడా, పన్నీరు పత్రముపై ( ఆకుపై) ఉంచిన పవిత్ర విభూతి ని స్వీకరించిన క్షణం నుండి అన్నియు మాయమవుతాయి"
*పన్నీరు పత్ర విభూతి మహిమలు*
గోకర్ణలో తీర్ధం లో ఆది శంకరులతో జరిగిన వాదనలో ఓడిపోయిన అభినవ్ గుప్తుడు ఆదిశంకరులపై ఒక మాయా మంత్రం ప్రయోగించాడు దాని వల్ల వచ్చిన దీర్ఘకాలిక వ్యాధిని , రాక్షసి తాటక ను శ్రీ రాములవారి ద్వారా సంహరింపజేసిన మహర్షి విశ్వామిత్రునికి కలిగిన అజీర్తి రోగమును, తిరువాడుదురై పీఠాధిపతి శ్రీ!ల!శ్రీ దేశికామూర్తి వారు తిరుచెందూర్ గోపురము నిర్మాణమునకు అవసరమైన కూలి చెల్లింపును, "తిరుచెందూర్ పిళ్ళై తమిళ్" గానములు రచించిన శ్రీ పాగాళి కూతర్ దీనికి భాష్యమును రచించిన శ్రీ గుహశ్రీ రాసపతి వారు, శ్రీ మీనాక్షి సుందరం పిళ్ళై గురూజీ వారు శివ సుబ్రహ్మణ్యుల బంధమును అద్భుతముగా వివరించిన "కందర్ కలి వేన్బా" అను గ్రంధములో మరియు జీవ సమాధి అయిన సిద్ధర్ కుమారగుబరర్ వారి జీవిత చరిత్ర లోను, తిరుప్పుగల్ కీర్తనలు రచించిన శ్రీ అరుణగిరినాధర్ మొదలగు వారు ఈ పత్ర విభూతి మహిమను స్వయంగా అనుభవించి ఈ విభూతి యొక్క మహిమలను ప్రపంచానికి అందించాలనే సత్సంకల్పం వారి రచనలతో గ్రంధములలో పొందుపరిచారు.
విభూతి మహిమను పాడిన అరుణగిరినాథర్ పత్ర విభూతి ధారణా విధానమును ఇలా వివరించెను.
‘అరుముగం’ అని ఆరుసార్లు పఠించి, పవిత్ర పత్ర భస్మాన్ని (విభూతిని) వారి శరీరాలపై పూసుకునే గొప్ప సాధువుల లు, భక్తులు స్వామివారి పాదపద్మములకు వినయంగా సాష్టాంగ నమస్కారం చేసి పూజించిన ఫలము, మానసిక ప్రశాంతత మరియు స్వామి వారి అనంతమైన కృపను పొందుతాము.
అసలు రచన శ్రీమతి చిత్రా మూర్తి గారు "జ్ఞాన ఆలయం" పత్రిక లోని తమిళ వ్యాసమునకు ( Patra VIbhooti తెలుగు సారాంశం అనువాదం.
రవికుమార్ పేరంబాకం
శ్రీ కార్తికేయ సేవ భక్త బృందం
మచిలీపట్టణం
9059065452

No comments:
Post a Comment